కొండెక్కాలంటే భయపడుతున్న భక్తులు.. .తిరుమల ఘాట్ రోడ్ లో మరో ప్రమాదం

కొండెక్కాలంటే భయపడుతున్న భక్తులు.. .తిరుమల ఘాట్ రోడ్ లో మరో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి.  ఘాట్ రోడ్లపై ప్రయాణించడం , కొండపైకి ఫిట్‌నెస్ లేని వాహనాలపై డ్రైవర్లకు అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కలియుగ వైకుంఠనాధుడి నుంచి సప్తగిరులకు వెళ్లే ఘాట్ రోడ్లు భక్తుల ప్రాణాలను హరిస్తున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తుండగా, మరికొందరు రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్య డ్రైవింగ్, వేగ నియంత్రణ పర్యవేక్షణ లేకపోవడం, స్పీడ్ డ్రైవింగ్ కారణంగా  రెండు నెలలుగా తరచూ ఘాట్ రోడ్డులో ప్రమాదాలకు గురై శ్రీనివాసుడి భక్తులు‌ గాయాల పాలు అవుతుండగా, కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇప్పుడు..తిరుమల మొదటి ఘాట్ రోడ్ వినాయక గుడి వద్ద కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి పక్కనున్న కల్వర్టులోకి ఒరిగింది.ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్పగాయాలయ్యాయి.  డ్రైవర్ నిద్ర మత్తుతో కారు నడపడం వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

తిరుమల ఘాట్ రోడ్లలో జరుగుతున్న వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు...ఇటు టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా..రెండు ఘాట్ రోడ్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ భక్తులతో వెళ్తున్న బస్సు,టెంపో లాంటి వాహనాలు పల్టీలు కొట్టడం మరింత టెన్షన్ కలిగిస్తోంది. అయితే ప్రమాదాలకు వాహనదారులు కారణమా.. ఘాట్ రోడ్లలోనే మార్పులు చేయాల్సి ఉందా అన్న చర్చ జరుగుతోంది.

ALSO READ:ఎర్ర దొంగల ముఠా అరెస్ట్.. 33 దుంగలు స్వాధీనం