యాక్సిడెంట్లను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్పీ కోటిరెడ్డి

యాక్సిడెంట్లను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. 35వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్ సేఫ్టీ అవేర్​నెస్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆర్టీఏ, ఆర్టీసీ, పోలీస్ అధికారులు, వికారాబాద్ పట్టణంలోని కాలేజీ, స్కూల్ స్టూడెంట్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎంఆర్పీ పెట్రోల్ బంక్ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు గంటకు 400 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. స్కూల్స్, కాలేజీల్లో స్టూడెంట్లకు రోడ్డు ప్రమాదాలు, రవాణా , మైనర్ డ్రైవింగ్ విషయాలపై  టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్, ఆర్టీఏ అధికారి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.  

ట్రాఫిక్ రూల్స్​ను పాటించాలి

చేవెళ్ల: ట్రాఫిక్ రూల్స్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సైదులు అన్నారు.రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం శంకర్​పల్లి టౌన్​లో స్కూల్ స్టూడెంట్లతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సైదులు మాట్లాడుతూ..  మైనర్ డ్రైవింగ్ కారణంగానే ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మైనర్లకు వెహికల్స్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

 శంషాబాద్​లో..

శంషాబాద్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా శంషాబాద్ లోని స్కూల్ స్టూడెంట్లతో కలిసి ట్రాఫిక్ పోలీసులు 2కే రన్ నిర్వహించారు. 150 మందికి పైగా స్టూడెంట్లు పాల్గొన్నారు.