రెగ్యులర్ పేషంట్లకు ట్రీట్​మెంట్ అందుతలే!

రెగ్యులర్ పేషంట్లకు ట్రీట్​మెంట్ అందుతలే!

హెచ్ఐవీ, క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్​మెంట్ అందుతలే!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఓటీ సేవలు బంద్

డయాలసిస్ రోగులకూ తప్పని ఇబ్బందులు

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా మహమ్మారి హెచ్ఐవీ, క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్ రోగులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు వైద్య సిబ్బంది అందరూ కరోనా ట్రీట్ మెంట్ లోనే నిమగ్నమవడంతో వీరికి వైద్య సేవలు అందడం లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటళ్లను పూర్తిగా వాడుకుంటున్నాయి. చాలా ఆస్పత్రుల్లో ఇప్పటికే ఔట్ పేషెంట్ డిపార్ట్ మెంట్లు, ఆపరేషన్ థియేటర్లు బంద్ చేశారు. దీంతో హెచ్ఐవీ, క్యాన్సర్, డయాలసిస్ బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఢిల్లీలోని ఎయిమ్స్, మన రాష్ట్రంలోని గాంధీ సహా మరికొన్ని ఆస్పత్రుల్లో సాధారణ ఓపీ సేవలను పూర్తిగా బంద్ చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరినీ కరోనా ట్రీట్ మెంట్ సేవలకే  వినియోగించుకుంటున్నారు. దీంతో చాలామంది క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ సేవలు అందడం లేదు. హెచ్ఐవీ పేషెంట్లకు లోకల్ ఏఆర్టీ సెంటర్లలో మందులు దొరకడం లేదు. కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు లభించడం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ ఎలాగోలా వెళ్లినా ఆస్పత్రుల్లో సేవలే అందకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

ఇదీ పరిస్థితి…

మైత్రి అనే పేషెంట్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో నోటి క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఆమెకు అర్జంట్ గా సర్జరీ చేయాలని డాక్టర్లు మార్చి 13న చెప్పారు. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ విధించడంతో ఎయిమ్స్ లో ఓపీ, ఓటీ సేవలు నిలిపివేశారు. మైత్రి నొప్పితో ఆస్పత్రికి వెళ్లినా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఆస్పత్రిలో అన్ని సేవలు బంజేశామని, ప్రభుత్వం మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు తామేం చేయలేమని చెబుతున్నారు. మరో పేషెంట్ ఆశా మెహతా పేగు క్యాన్సర్ కు బెంగళూర్ లో చికిత్స పొందుతోంది. అయితే లాక్ డౌన్ తో ట్రీట్ మెంట్ అందడం లేదని ఆమె వాపోతోంది.

ఢిల్లీలో దాదాపు అన్ని హాస్పిటళ్లలో ఔట్ పేషెంట్ కీమోథెరపీ సేవలు ఆగిపోయాయని ‘కెన్ సపోర్ట్’ ఆర్గనైజేషన్ ప్రతినిధి రాజ్విందర్ తెలిపారు. ఒక్క సఫ్దర్ గంజ్ ఆస్పత్రిలో ఆంకాలజీ డిపార్ట్ మెంట్ ఓపెన్ ఉన్నా అక్కడ అందరికీ ట్రీట్ మెంట్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘లాక్ డౌన్ తో హెచ్ఐవీ పేషెంట్లు లోకల్ ఏఆర్టీ సెంటర్లకు రాలేకపోతున్నారు. దీంతో వారు డెయిలీ డోస్ ను మిస్ అవుతున్నారు. ఇలా అయితే వాళ్ల ఇమ్యూనిటీ పవర్ మరింత దెబ్బతింటుంది’ అని ముంబైకి చెందిన గణేశ్ ఆచార్య చెప్పారు.

హైదరాబాద్ లో డయాలసిన్ రోగులకు పాస్ లు ఇచ్చి, అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. అయితే మిగతా సిటీల్లో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో బాధితులు డాక్టర్ లెటర్ చూపించినా పోలీసులు అడ్డుకుంటున్నారు.

For More News..

దేశంలో 5,351కు చేరిన కరోనా కేసులు

23 రోజుల బాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల?

ఈ నెల కొత్త కరెంట్ బిల్లు రాదు

వారికి కూడా 50 లక్షల కరోనా ఇన్సూరెన్స్