కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేములవాడల్లో రెజంగ్ల రజ్ కలశయాత్ర

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేములవాడల్లో  రెజంగ్ల రజ్ కలశయాత్ర

కరీంనగర్ టౌన్/ వేములవాడ వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేములవాడల్లో అఖిల భారత  యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం రెజంగ్ల రజ్​కలశ యాత్రను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ చౌక్ నుంచి భగత్ నగర్ వివేకానంద  విద్యానికేతన్ స్కూల్ వరకు  ర్యాలీ కొనసాగింది. యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఒగ్గుడోలు కళాకారుల డ్యాన్సులతో ర్యాలీ నిర్వహించినట్లు ర్యాలీ కన్వీనర్, అఖిలభారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గసభ్యుడు సందెవేణి మహేందర్ యాదవ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1962లో భారత్, చైనా యుద్ధంలో దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన 114 మంది యాదవ వీరయోధుల స్మరణార్థం అహిర్ (యాదవ్) రెజిమెంట్ స్థాపించనున్నట్లు వెల్లడించారు.  ఈ కలశయాత్ర బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 122  రోజుల కింద ప్రారంభించగా.. ఆదివారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుందన్నారు. 

వేములవాడలో నిర్వహించిన యాత్రలో సైనిక విభాగం మాజీ అధ్యక్షుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ స్టేట్ మెంబర్ మహేందర్ నాథ్ యాదవ్ హాజరై యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవులు ఘన స్వాగతం పలికారు. తిప్పాపూర్ నుంచి వేములవాడ రాజన్న ఆలయం మీదుగా కోరుట్ల బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నక్క మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్, ఓదెలు యాదవ్, కొమురయ్య యాదవ్, సత్యనారాయణయాదవ్,  సంతోష్​యాదవ్​, చంద్రశేఖర్ యాదవ్, రవీందర్ యాదవ్, మల్లేశంయాదవ్​, తదితరులు పాల్గొన్నారు.