
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల తర్వాత మేయర్ పీఠం ఎవరికి దక్కనుందనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. 250 స్థానాలకు జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. దాంతో మేయర్ పీఠం తమకు ఈజీగా దక్కుతుందని ఆప్ ఫిక్స్ అయ్యింది. కానీ, ఆప్ ఆశలపై నీళ్లు చల్లేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నది. ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సినంత సంఖ్యాబలం లేనప్పటికీ.. మేయర్ అభ్యర్థిని రంగంలోకి దింపింది. షాలిమార్‌బాగ్ కౌన్సిలర్ రేఖా గుప్తాను ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కమల్ బాగ్రీ, స్టాండింగ్ కమిటీకి కమల్‌జిత్ సెహ్రావత్ పేర్లను ప్రకటించింది.