జూరాలకు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు .. 31 గేట్లు ఎత్తిన అధికారులు

జూరాలకు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు .. 31 గేట్లు ఎత్తిన అధికారులు

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్​ల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు దగ్గర శనివారం ఉదయం 31 గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లను విడుదల చేసిన అధికారులు వరద తగ్గడంతో  25 గేట్లకు కుదించారు. జూరాల హైడల్ ప్రాజెక్టు దగ్గర ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 25 గేట్లను ఎత్తి జూరాల ప్రాజెక్టుకు 76 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 316.970 మీటర్ల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని 25 గేట్ల ద్వారా 1,19,070 వేల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత 29,805 క్యూసెక్కులను వదులుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-–1కు 650 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 640 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,51,002 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.