దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు... రూ. 65 వేల కోట్ల పెట్టుబడికి రిలయన్స్ కోకాకోలా బాట్లర్స్ ప్లాన్

దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు... రూ. 65 వేల కోట్ల పెట్టుబడికి రిలయన్స్ కోకాకోలా బాట్లర్స్ ప్లాన్
  • రిలయన్స్​​తో కలిసి ఏర్పాటు చేయనున్న మూడు కంపెనీలు రూ.65 వేల కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మూడు కోకా-కోలా బాట్లింగ్ కంపెనీలు ప్రపంచ ఫుడ్ ఇండియా సమ్మిట్ మొదటి రోజున ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 65 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమ్మిట్​లో ఈ రంగం రూ.  లక్ష కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షింవచ్చని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ గురువారం తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖతో రూ. 40 వేల కోట్ల ఒప్పందం చేసుకుంది. 

ఈ ఎంఓయూ ప్రకారం, ఆర్​సీపీఎల్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో ఆహార ఉత్పత్తులు పానీయాల కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ. 1,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. మూడు కోకా-కోలా బాట్లింగ్ కంపెనీలు ఎస్​ఎల్​ఎంజీ బెవరేజెస్, హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్, కంధారి గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఫుడ్​ప్రాసెసింగ్​ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి రూ. 25,760 కోట్ల (2.96 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నాయి. గ్రీన్​ఫీల్డ్, బ్రౌన్​ఫీల్డ్ ప్రాజెక్టుల కోసం మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.