జియో నెట్వర్క్లో కొత్త నెట్ ఫ్లిక్స్ ప్యాకేజీలు

జియో నెట్వర్క్లో  కొత్త నెట్ ఫ్లిక్స్ ప్యాకేజీలు

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో..నెట్‌ఫ్లిక్స్ బండిల్ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. ఇప్పటికే అనేక మొబైల్ పోస్ట్ పెయిడ్, ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లతో ఉచితంగా నెట్ ఫ్లిక్స్  సభ్వత్యాన్ని అందిస్తున్నా జియో.. తాజాగా రెండు కొత్త ప్లాన్లతో తన ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు నెటిఫ్లిక్స్ ఉచిత సభ్యత్వాన్ని పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. 

నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన OTT (ఓవర్-ది-టాప్) కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ఇది భారతీయ మార్కెట్‌కు సంబంధించి చాలా ఖరీదైనది. అయితే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ మొబైల్ సర్వీస్ సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా నెటిఫ్లిక్స్ పొందవచ్చు. జియో నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తోంది. 
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా ప్రారంభించిన మొదటి ప్లాన్ రూ.1099. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు 2GB రోజువారీ డేటా.. 5G వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత 5G డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు, Jio యాప్‌లను పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొబైల్‌ నెట్‌ఫ్లిక్స్కు ఉచిత సభ్యత్వానికి అర్హులు.

-రిలయన్స్ జియో నుంచి రెండో ప్లాన్ రూ. 1499 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల చెల్లుబాటు, 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 5G వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత 5G డేటా, 100 SMS/రోజు, Jio యాప్‌లను అందిస్తుంది. ఎక్కువ డేటాను అందించడం మినహా చాలావరకు ఈ ప్లాన్ రూ.1099 ప్లాన్‌తో సమానంగా కనిపిస్తుంది. అయితే రూ. 1499 ప్లాన్‌తో వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్ పొందుతారు.