జియో ఫైబర్ సరికొత్త ప్లాన్: నెల రోజులు ఫ్రీ ట్రయల్

జియో ఫైబర్ సరికొత్త ప్లాన్: నెల రోజులు ఫ్రీ ట్రయల్

రిలయన్స్ జియో ఫైబర్  బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్ తో మరో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్  వీటిని లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. చేసింది. సెప్టెంబర్ 1 నుండి  జియోఫైబర్  కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక నెల రోజులుపాటు  ఎలాంటి కండీషన్లు లేని 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది.  వీరితో పాటు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియో ఫైబర్  పాత కస్టమర్లకు కూడా 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది. అలాగే 999, 1499  ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్‌ గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ) చందా ఉచితం. 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా వస్తుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ప్లాన్‌ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతారు. విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరమైన ప్రస్తుత సమయంలో వీటిని తీసుకొచ్చామని జియో ఫైబర్  ఒక  ప్రకటనలో తెలిపింది.

జియోఫైబర్ నో-కండిషన్ 30 రోజుల  ఉచిత ట్రయల్, 150 MBPS అపరిమిత ఇంటర్నెట్, 4K  సెట్ టాప్ బాక్స్
ఉచిత వాయిస్ కాలింగ్, నచ్చకపోతే ప్లాన్ వెనక్కి తీసుకోవచ్చు.

జియో ఫైబర్ కొత్త ప్లాన్స్:
399  రూపాయల ప్లాన్ లో  30 MBPS  స్పీడ్
699 రూపాయల ప్లాన్ లో  100 MBPS స్పీడ్
999  రూపాయల ప్లాన్ లో  150 MBPS స్పీడ్
1,499 రూపాయల ప్లాన్ లో 300 MBPS  స్పీడ్