న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ స్థాపించిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ ‘అనామలీ’ను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో బ్రాండ్ ట్రేడ్‌మార్క్‌లు, డిజిటల్ ఆస్తులు కూడా ఉన్నాయి. కంపెనీ తన రిటైల్ నెట్‌వర్క్, టిరా బ్యూటీ ప్లాట్‌ఫామ్ ద్వారా అనామలీ బ్రాండ్‌ను విస్తరించనుంది. 2021లో ప్రియాంక చోప్రా స్థాపించిన అనామలీ ఒక వీగన్, హై-పర్ఫార్మెన్స్ హెయిర్‌కేర్ బ్రాండ్. అందుబాటు ధరల్లో ఉత్పత్తులు అందిస్తోంది.
రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, “ కొత్త తరహా బ్యూటీ బ్రాండ్‌లను విస్తరించడంలో భాగంగా అనామలీని కొనుగోలు చేశాం” అని అన్నారు. ప్రియాంక చోప్రా క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగి, బ్రాండ్ విజన్, ఇన్నోవేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌కి నాయకత్వం వహిస్తారని తెలిపారు. “రిలయన్స్ రిటైల్ ఎక్స్‌పీరియెన్స్, ఇన్నోవేషన్ వల్ల మరింత మంది యూజర్లకు చేరువవుతాం” అని ప్రియాంక అన్నారు.

