
న్యూఢిల్లీ: తాము కేజీ బేసిన్‌లోని ఓఎన్జీసీ బేసిన్ నుంచి అక్రమంగా గ్యాస్‌ను తీశామని, ఇందుకు పరిహారం చెల్లించాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిలయన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీలోని కేజీ బేసిన్ నుంచి రిలయన్స్, దీని కన్సార్టియం పార్ట్నర్స్ గ్యాస్తీసినందుకు రూ.12,500 కోట్లు చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ విషయమై సింగపూర్‌కు చెందిన ఆర్బిట్రేటర్ లారెన్స్ బూ నాయకత్వంలోని ముగ్గురు సభ్యులు ట్రిబ్యునల్‌పై తీర్పు చెప్పిందని, ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు లేదని
రిలయన్స్ వాదించింది.