సోడా నుంచి సబ్బుల దాకా  రిలయన్స్​ ఎంట్రీ.. ధరల యుద్ధం షురూ

సోడా నుంచి సబ్బుల దాకా  రిలయన్స్​ ఎంట్రీ.. ధరల యుద్ధం షురూ
  • లక్స్​, సర్ఫ్​ ఎక్స్​ల్​తో పోటీకి సై
  • డిస్ట్రిబ్యూషన్​ స్ట్రాటజీ ఖరారు

వెలుగు బిజినెస్​ డెస్క్​: సాఫ్ట్​డ్రింక్స్​లో అడుగు పెట్టి రేట్ల తగ్గింపుతో యుద్ధానికి తెరతీసిన రిలయన్స్​ తాజాగా హోమ్​కేర్​, ఎఫ్​ఎంసీజీలో అదే స్ట్రాటజీ అమలు చేస్తోంది. పోటీదారుల ప్రొడక్టుల రేట్లతో పోలిస్తే 30 నుంచి 35 శాతం తక్కువ రేట్లకే హోమ్​కేర్​, ఎఫ్​ఎంసీజీ  ప్రొడక్టులను  రిలయన్స్ ​అమ్ముతోంది. తక్కువ రేట్లకే దొరుకుతున్న రిలయన్స్​ ప్రొడక్టులను ఒకసారి ట్రై చేయడానికి కస్టమర్లు కచ్చితంగా ఇష్టపడతారని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఒకసారి కొని క్వాలిటీ ఎలా ఉందో చూసి, పెర్​ఫార్మెన్స్​పై కస్టమర్లు ఒక నిర్ణయానికి వస్తారని వారంటున్నారు.

ఫాస్ట్​మూవింగ్​ కన్జూమర్​ గూడ్స్​ (ఎఫ్​ఎంసీజీ) కోసం రిలయన్స్​ రిటెయిల్​ వెంచర్స్​ లిమిటెడ్​ ఒక పూర్తిస్థాయి సబ్సిడరీని ఆర్​సీపీఎల్​ పేరుతో ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి ఈ కంపెనీ ప్రొడక్టులను దేశంలోని కొన్ని మార్కెట్లలోనే ప్రవేశ పెట్టారు. మిగిలిన ప్రాంతాలలోను అందుబాటులోకి తెచ్చేందుకు డీలర్​ నెట్​వర్క్​ ఏర్పాటు ప్రయత్నాలను కంపెనీ ముమ్మరం చేసింది. మోడర్న్, జనరల్​ ట్రేడ్​ ఛానెల్స్​ రెండింటి ద్వారా తన ఎఫ్​ఎంసీజీ ప్రొడక్టులను రిలయన్స్​ రిటెయిల్​ అమ్మనుంది. ట్రెడీషనల్​ డీలర్​, స్టాకిస్టుల నెట్​వర్క్​తో పాటు, మోడర్న్​ బీ2బీ ఛానెల్స్​ద్వారా డిస్ట్రిబ్యూషన్​కు రిలయన్స్​ చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఎఫ్​ఎంసీజీ  మార్కెట్​110 బిలియన్​ డాలర్లు..

దేశంలోని ఎఫ్​ఎంసీజీ మార్కెట్​ విలువ 110 బిలియన్​ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. ఎఫ్​ఎంసీజీ రంగంలో హిందుస్తాన్​ యూనిలీవర్, ప్రోక్టర్​ అండ్​ గ్యాంబుల్​, రెకిట్​, నెస్లే వంటి మల్టీ నేషనల్​ కంపెనీలే పెద్ద ప్లేయర్లుగా ఉన్నాయి. తన గ్లిమ్మర్​ బ్యూటీ సోప్స్​, రియల్​ నేచురల్​ సోప్స్​, ప్యూరిక్​ హైజీన్​  సోప్స్​ను రూ. 25 కే రిలయన్స్​ అమ్ముతోంది. అంటే ఇతర పెద్ద బ్రాండ్​  ప్రొడక్టుల కంటే తక్కువ రేటుకే ఆఫర్​ చేస్తోంది. 100 గ్రాముల లక్స్ సబ్బు రేటు రూ. 35 అయితే, 75 గ్రాముల డెట్టాల్​ సబ్బు రేటు రూ.​ 40, సంతూర్​ 100 గ్రాముల సబ్బు రేటు రూ. 34. ఇక తన 2 లీటర్ల ఫ్రంట్​లోడ్​ లిక్విడ్​ డిటర్జెంట్​ఎన్జో ను ఆర్​సీపీఎల్​ (రిలయన్స్) రూ.250 కి అమ్ముతుంటే, సర్ఫ ఎక్సెల్​ 2 లీటర్ల ప్యాక్​ రేటు రూ. 325 గా ఉంది. కిలో ఎన్జో ఫ్రంట్​ లోడ్​ డిటర్జెంట్ పౌడర్​ను రూ. 149 కే ఆర్​సీపీఎల్​ ఆఫర్​ చేస్తోంది.

డిష్​వాష్​ సెగ్మెంట్లో సైతం తన ప్రొడక్టుల రేట్లను ఇలాగే నిర్ణయించింది రిలయన్స్. రూ. 5, రూ. 10, రూ.15 రేట్లతో బార్స్​ను ప్రవేశపెట్టింది. దీంతోపాటే, లిక్విడ్​ జెల్​ ప్యాక్స్ ​కూడా రూ. 10, రూ. 30, రూ. 45 రేట్లకు అమ్ముతోంది.  హిందుస్తాన్​ యూనిలీవర్ విమ్​, జ్యోతి ల్యాబ్స్​ ఎక్సో, ప్రిల్​లతో డిష్​ వాషర్​ కేటగిరీలో పోటీపడుతోంది రిలయన్స్​ రిటెయిల్​ కంపెనీ. ఎన్జో డిటర్జెంట్ బార్స్​ రేట్లను మాత్రం ఆర్​సీపీఎల్​ ఇంకా ప్రకటించలేదు. ఈ నెల మొదట్లోనే క్యాంపా కోలాను దేశీయ మార్కెట్లోకి మళ్లీ తెచ్చింది ఆర్​సీపీఎల్​. దీంతో,  పెప్సీకో, కోకా–కోలా కంపెనీలతో నేరుగా పోటీకి దిగింది. 200 ఎంఎల్​ క్యాంపా కోలా బాటిల్​ను రూ. 10 కి, 500 ఎంఎల్​ బాటిల్​ను రూ. 20 కే ఆర్​సీపీఎల్ అమ్ముతోంది. 

బ్యూటీ, పర్సనల్​ కేర్​ మార్కెట్​ వాల్యూ 21.65 బిలియన్​ డాలర్లు..

హిందుస్తాన్ ​యూనిలీవర్​ సర్ఫ్​, లక్స్ ​బ్రాండ్​లతో పాటు, ఆయా కేటగిరీలలో మార్కెట్​ లీడర్లుగా ఉన్న ప్రొడక్టులతో రిలయన్స్​ పోటీకి దిగిందని టెక్నోపాక్​ ఎడ్వైజర్స్​ చైర్మన్​ అరవింద్​ సింఘాల్​ వెల్లడించారు. తక్కువ రేటుకే దొరుకుతున్న రిలయన్స్​ ప్రొడక్టులను కస్టమర్లు   ఒకసారి కొని ట్రై చేస్తారని, సంతృప్తి చెందితే మళ్లీ–మళ్లీ కొంటారని పేర్కొన్నారు. ఎఫ్​ఎంసీజీలో అడుగు పెట్టడానికి రిలయన్స్​ పూర్తి లెవెల్​లో హోమ్​వర్క్​ చేసిందన్నారు. ఇండియాలో బ్యూటీ, పర్సనల్​ కేర్​ మార్కెట్​వాల్యూ 2022లో 21.65 బిలియన్​ డాలర్లు. రిలయన్స్​ ప్రొడక్టులు మార్కెట్లోకి ఇంకా రావాల్సి ఉందని ఆల్​ ఇండియా కన్జూమర్​ ప్రొడక్ట్స్​ డిస్ట్రిబ్యూటర్స్​ ఫెడరేషన్​ (ఏఐసీపీడీఎఫ్​) ప్రెసిడెంట్​ ధైర్యాషిల్​పాటిల్​ చెప్పారు. లక్స్​, సంతూర్​ వంటి సబ్బుల బ్రాండ్లు మార్కెట్లో బాగా పాతుకుపోయాయని, మార్కెట్లో మొత్తం 1000 పైగా ఇతర బ్రాండ్లు దొరుకుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తన బ్రాండ్​ను మార్కెట్లోకి తెచ్చి, ఎడ్వర్టయిజ్​మెంట్​ మొదలు పెడితే తప్ప ఆర్​సీపీఎల్​ ప్రొడక్టులకు మార్కెట్లో గుర్తింపు రాదని వెల్లడించారు.