హైదరాబాద్, వెలుగు: ఆటోమొబైల్ రిటైల్ సంస్థ పీపీఎస్ మోటార్స్, హైదరాబాద్‌లో రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.10.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి మొదలవుతోంది. ఆర్–పాస్ ద్వారా మార్చి 31, 2026 వరకు రూ.10.29 లక్షలకే కొనుక్కోవచ్చు.
కొత్త రెనాల్ట్ డస్టర్‌లో 163 పీఎస్ టర్బో టీసీఈ 160 ఇంజిన్ ఉంది. 6-స్పీడ్ డీసీటీ లేదా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. 7-ఏళ్ల రెనాల్ట్ ఫరెవర్ వారంటీ, సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లు, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, ఏడీఏఎస్ ఫీచర్లు, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి.
