4ల‌క్ష‌ల‌ అమ్మకాల మైలురాయిని దాటిన రెనో క్విడ్‌

V6 Velugu Posted on Nov 27, 2021

4 లక్షల సంచలన మైలురాయిని ఇటీవలే దాటిన రెనో క్విడ్‌, మినీ కారు సెగ్మెంట్‌లో ప్రధాన శ్రేణిలో నిలుస్తూ తన ప్రయాణాన్ని భారతదేశంలో కొనసాగిస్తోంది. ఈ మైలురాయిని హైదరాబాద్‌లో క్విడ్‌ యజమానులతో కలిసి pps రెనాల్ట్, ఆర్కా రెనాల్ట్ .. రెనో క్విడ్‌ మైలేజీ ర్యాలీని నిర్వహించాయి. మొత్తం 96 కి.మీ దూరం సాగిన ఈ ర్యాలీకి హైద‌రాబాద్, గ‌చ్చిబౌలి, హైటెక్ సిటీ, హోట‌ల్ రాడిస‌న్ లో  పచ్చజెండా ఊపారు.

ప్రస్తుత క్విడ్‌ కస్టమర్లు మ్యాగ్జిమం మైలేజీ పొందాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఈ ర్యాలీ నెహ్రూ రింగ్ రోడ్ వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడకకు అనూహ్యమైన స్పందన లభించింది. 25మంది కస్టమర్ల కంటే ఎక్కువ మంది ఇందులో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా 20.32 సెం.మీటర్ల టచ్‌ స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లేతో కూడిన మీడియాన్యావ్‌, ఫ్లోర్‌ కన్సోల్‌ మౌంటెడ్ AMT డయల్‌ వంటవన్నీ డ్రైవింగ్‌ను శ్రమలేకుండా చేస్తున్నాయి. 10వ వార్షిక వేడుకల సందర్భంగా రెనో ఇటీవలే క్విడ్ MY21 ను లాంచ్‌ చేసింది. క్విడ్‌ కస్టమర్లందరికీ స్పేర్‌ పార్టులు, విడిభాగాలపై 10%  డిస్కౌంట్‌, లేబర్‌ ఛార్జీలపై 20%  డిస్కౌంట్‌ సహ అనేక స్పెషల్‌ ఆఫర్లను రెనో ప్రకటించింది.

Tagged Renault Kwid, 4 million sales, milestone

Latest Videos

Subscribe Now

More News