సెక్యూరిటీ డిపాజిట్​లేకుండా ఇండ్లు అద్దెకు

సెక్యూరిటీ డిపాజిట్​లేకుండా ఇండ్లు అద్దెకు

న్యూఢిల్లీ: ప్రాపర్టీ ఓనర్లకు సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించకుండానే  ‘రెంట్​ఓకే’ యాప్​ ద్వారా స్టూడెంట్లు, యంగ్​ ప్రొఫెషనల్స్​ ఇండ్లను అద్దెకు తీసుకోవచ్చు. ఫైనాన్షియల్​ గ్యారంటీస్​ కంపెనీ ఇకారో గ్యారంటీస్​తో కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని రెంట్​ ఓకే​ ప్రకటించింది. ప్రాపర్టీ ఓనర్లు రెంట్​ ఓకే యాప్​లో తమ ప్రాపర్టీల గురించి ప్రకటనలు ఇవ్వవచ్చు. విజిట్లను షెడ్యూల్​ చేయవచ్చు. కిరాయికి వచ్చే వారి కేవైసీని పూర్తి చేయవచ్చు. పోలీస్​ వెరిఫికేషన్​, ఆటోమేట్​ రెంట్​ కలెక్షన్​, అకౌంటింగ్​, రెంట్​ అగ్రిమెంట్​ వంటి సదుపాయాలూ ఉన్నాయి. దేశమంతటా తమ సేవలను అందజేస్తున్నామని ఇకారో తెలిపింది.

సెక్యూరిటీ డిపాజిట్​కు బదులు రెంటల్​బాండ్​ ఉంటుందని, దీనిద్వారానే కొంత అద్దెను ముందుగా చెల్లించాల్సి ఉంటుందని సంస్థ సీఓఓ పంకజ్​ భన్సాలీ వివరించారు. ఇండ్ల యజమానులకు తమ అద్దె ఆదాయంపై లోన్లు కూడా ఇప్పిస్తామని వెల్లడించారు. వ్యక్తులకు, ఎంట్రప్రినార్లకు, ఎంఎస్​ఎంఈలకు కూడా కొల్లటేరల్​, క్యాష్​రూపంలో గ్యారంటీ సేవలు అందిస్తున్నామని వివరించారు. తమ యాప్​లో 220 నగరాల్లోని 12 వేల ప్రాపర్టీలు ఉన్నాయని రెంట్​ఓకే ప్రకటించింది.