రిటెయిల్​ బూమ్​కు మిడిల్​క్లాసే దన్ను

రిటెయిల్​ బూమ్​కు  మిడిల్​క్లాసే దన్ను

వెలుగు బిజినెస్​ డెస్క్​:మన దేశంలో రిటెయిల్​ బూమ్​ను ఏటా రూ. 2.50 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్యలో సంపాదించే మాస్​ కన్జూమర్లే   ముందుండి నడిపించనున్నారట. దీంతో రిటెయిల్​ మార్కెట్​ 2030 నాటికి 1.3 ట్రిలియన్​ డాలర్ల ఆపర్చునిటీ అవుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది. ఆన్​లైన్​ బిజినెస్​ (ఈ–కామర్స్​) ఆపర్చునిటీ ఒక్కటే చూస్తే 300 బిలియన్​ డాలర్లుగా ఉండనుందని, ఇది దేశపు రిటెయిల్​ మార్కెట్లో 45 శాతానికి సమానమవుతుందని ఆ రిపోర్టు చెబుతోంది. తాము చెల్లించే డబ్బుతో మెరుగైన విలువుండే ప్రొడక్టులను కొనడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. ఏ కొనుగోలు నిర్ణయానికైనా ఇప్పుడు ఇంటర్​నెట్​ కీలకంగా మారిందని వివరించింది. సంపన్నులలాగే మాస్​ కన్జూమర్లు కూడా  బెస్ట్​ డీల్స్​ వెతుక్కోవడానికైనా ఇంటర్​నెట్​పైనే ఆధారపడుతున్నారని తెలిపింది. మాస్​ కన్జూమర్లలో 75 శాతం మిలినియల్స్​, జెన్​–జెడ్​ కన్జూమర్లేనని రెడ్​సీర్ ​రిపోర్టు వెల్లడించింది.

సొంతకాళ్లపై నిలబడిన జెన్​– జెడ్ యువతరం బట్టలు, బ్యూటీ అండ్ పర్సనల్​ కేర్​, ఎలక్ట్రానిక్స్​ వస్తువులను ఎక్కువగా కొంటుండగా, మరోవైపు మిలినియల్స్​ బ్యూటీ అండ్​ పర్సనల్​ కేర్​, ఫుడ్​ అండ్​ గ్రోసరీ, హెల్త్​ అండ్​ వెల్​నెస్​ ప్రొడక్టులంటే ఇష్టపడుతున్నారని రెడ్​సీర్​ రిపోర్టు తెలిపింది. ఇక జెన్​–ఎక్స్​ విషయానికి వస్తే ఎక్కువగా ఫుడ్​ అండ్​ గ్రోసరీ, హెల్త్​ అండ్​ వెల్​నెస్​ ప్రొడక్టుల వైపు చూస్తున్నట్లు వివరించింది. పాత తరపు వ్యక్తులతో పోలిస్తే జెన్​– జెడ్​ కన్జూమర్లు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటున్నారని, కాకపోతే వారు కూడా విలువ ఆధారంగానే కొనుగోళ్లు జరుపుతున్నారని రెడ్​సీర్​ రిపోర్టు పేర్కొంది. క్వాలిటీ నచ్చితే అన్​బ్రాండెడ్​ ఐటమ్స్​ కొనడానికి కూడా జెన్​–జెడ్​ కన్జూమర్లు ఇష్టపడుతున్నట్లు వివరించింది.  ఈ–కామర్స్​ ప్లాట్​ఫారమ్​లో  రేట్లు, డీల్స్​, డిస్కౌంట్లు, ప్రొడక్టుల క్వాలిటీ, ప్లాట్​ఫామ్​పై ఉండే నమ్మకం....ఈ మూడు అంశాల ఆధారంగా తమ కొనుగోలు నిర్ణయాలను జెన్–జెడ్​ కన్జూమర్లు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

మిడిల్​ క్లాస్​....

ఏటా రూ. 10 లక్షల దాకా సంపాదించే జనాభాను మిడిల్​ క్లాస్​గా మన దేశంలో పరిగణించొచ్చు. ఇలాంటి మిడిల్​ క్లాస్​ జనాభా ​ దేశంలో చాలా వేగంగా పెరుగుతోంది. 1995–2021 మధ్య కాలంలో ఈ కేటగిరీ జనాభా ఏటా 6.3 శాతం చొప్పున పెరిగారు. మొత్తం జనాభాలో వారి శాతం 31. 2031 నాటికి దేశంలో మిడిల్​ క్లాస్​ జనాభా 38 శాతానికి, ఆ తర్వాత 2047 నాటికి 60 శాతానికి పెరగనుందని అంచనా. దేశానికి ఇండిపెండెన్స్​ వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి మిడిల్​ క్లాస్​ జనాభా 100 కోట్లకు చేరుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి లో–ఇన్​కమ్​ క్లాస్​లోని చాలా మంది మిడిల్​క్లాస్​గా మారుతారని పేర్కొంటున్నారు.

రెండు గంటల్లోపే డెలివరీ కావాలి....

ఆన్​లైన్​ షాపింగ్​ చేసే మన కన్జూమర్లు అసలు వెయిట్​ చేయలేకపోతున్నట్లు ఒక సర్వేలో తేలింది. గ్రోసరీల నుంచి ఎలక్ట్రానిక్​ గాడ్జెట్ల దాకా ...అన్నింటినీ ఆన్​లైన్​లోనే కొని, ఇంటి వద్దే డెలివరీ తీసుకోవడానికి  భారతీయ కన్జూమర్లు ఇష్టపడుతున్నట్లు వండర్​మాన్​ థాంప్సన్​ గ్లోబల్​ రిపోర్టు వెల్లడించింది. ఆన్​లైన్​లో చేసే కొనుగోళ్లకు డెలివరీ రెండు గంటల లోపే జరగాలని 38 శాతం కన్జూమర్లు కోరుకుంటున్నట్లు ఈ రిపోర్టు తెలిపింది. ఈ–కామర్స్​ ఇండస్ట్రీకి ఇప్పుడు క్విక్​ డెలివరీస్​ కీలకంగా మారిందని పేర్కొంది. ఫాస్ట్​ డెలివరీ అంటేనే ఇండియన్​ కన్జూమర్లు ఎక్కువ ఇష్టపడుతున్నట్లు క్విక్​ కామర్స్​ ప్లాట్​ఫామ్​ జెప్టో  ఫౌండర్​ ఆదిత్​ పలిచ చెప్పారు. స్విగ్గీ ఇన్​స్టామార్ట్​, బ్లింకిట్​, డంజో, బిగ్​బాస్కెట్​ నౌ, జెప్టోలు ఈ డిమాండ్​నే ఆధారంగా చేసుకుని ఎదుగుతున్నాయి. ఈ కంపెనీలు గ్రోసరీలను సగటున 30 నిమిషాలలోపే అందించగలుగుతున్నాయి. ఈ మోడల్​లో చాలా సవాళ్లు ఎదురవుతున్నా క్విక్​ కామర్స్​ కంపెనీలు మంచి ఎదుగుదలనే రికార్డు చేస్తున్నాయి. క్విక్​కామర్స్​లో స్లో డౌన్​ ఛాయలే కనబడటం లేదని  వండర్​మాన్​ థాంప్సన్​ రిపోర్టు వెల్లడిస్తోంది. డిజిటల్​ ప్రొడక్టులను ఆన్​లైన్​లో కొనే విషయంలో 45 శాతం వాటాతో  గ్లోబల్​గా ఇండియానే టాప్​పొజిషన్​లో నిలుస్తున్నట్లు వివరించింది.​