మాజీ ఆటగాడికి పట్టం: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!

మాజీ ఆటగాడికి పట్టం: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!

టీమిండియా మెన్స్ క్రికెట్ టీం చీఫ్ సెలెక్ట‌ర్‌గా మాజీ దిగ్గజ బౌలర్ అజిత్ అగార్క‌ర్‌ను నియ‌మించే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ దరఖాస్తుకు నేటితో(జూన్ 30) గడువు ముగియగా.. మరో రెండ్రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని సమాచారం. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అగార్కర్‌ జూన్ 29న తన పదవికి రాజీనామా చేయడం ఈ ప్రశ్నకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. 

మాజీ చీఫ్ సెలెక్టర్ చేతనశర్మ స్టింగ్ ఆపరేషన్ దొరకడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం శివశంకర్ దాస్ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే, చీఫ్ సెలెక్టర్‌ పోస్టుకు జీతాన్ని కూడా పెంచనున్నారని సమాచారం. ప్రస్తుతం ఏడాదికి కోటి రూపాయలు ఇస్తుండగా.. దానిని పెంచనున్నారట.

BCCI is set to increase the salary of the chief selector, the current salary is 1 crore.

Ajit Agarkar is set to become the new chief selector of the Indian Team. [The Indian Express] pic.twitter.com/EMTz3lQJdM

— Johns. (@CricCrazyJohns) June 30, 2023

రేసులో ఎంతమంది ఉన్నా.. అగార్కర్ ఈ పదవికి సరితూగగలడని బీసీసీఐ భావిస్తోందట. 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో అగార్క‌ర్ కీలక బౌలర్. 45 ఏళ్ల అగార్క‌ర్ 26 టెస్టులు, 191 వ‌న్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 58 వికెట్లు, వ‌న్డేల్లో 288 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడిన అగార్క‌ర్ 29 వికెట్లు తీశాడు.