Pakistan Elections 2024: పాక్ ఎన్నికల్లో ఓటేసిన మెస్సి, రోనాల్డో, నెయ్‌మార్

Pakistan Elections 2024: పాక్ ఎన్నికల్లో ఓటేసిన మెస్సి, రోనాల్డో, నెయ్‌మార్

రెండ్రోజుల క్రితం జరిగిన పాకిస్థాన్‌లో ఎన్నికల్లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఓటేశారు. అందునా వారు సామాన్య ఫుట్‌బాల్ క్రీడాకారులు కాదు. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సి, పోర్చుగీస్ సంచలనం క్రిస్టియానో రోనాల్డో, బ్రెజిలియన్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్, ఫ్రెంచ్ క్రీడాకారుడు ఎంబాపేలు ఓటేశారు. అదెలా సాధ్యం.. వారిది పాకిస్తాన్ కాదు కదా..!  అనకండి. అది పాకిస్తాన్.. అలానే ఉంటది.

ఒకవైపు పాకిస్థాన్‌లో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే, మరోవైపు ఆయా పార్టీల నేతలు రిగ్గింగ్ మొదలుపెట్టారు. ఆ సమయంలో కొందరు బ్యాలెట్ పేపర్లపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లు రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. కౌంటింగ్ సమయంలో అధికారులు వాటిని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, పాకిస్థాన్‌లో ఎన్నికల కౌంటింగ్ మొదలై రెండు రోజులు గడుస్తున్నా ఫలితాలు పూర్తికాలేదు. ఇంకా ఏడు ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో పీటీఐ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా 93 సీట్లు సాధించగా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ 74, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లలో గెలుపొందాయి. ఇతర రాజకీయ పార్టీల నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 37 స్థానాల్లో విజయం సాధించారు.

ALSO READ :- IND vs AUS U19 WC: ఫైనల్ సమరం: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా

పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లుండగా, ఇందులో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని ఎన్నికల్లో ఆయా పార్టీల అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఈసారి ఓ అభ్యర్థి చనిపోవడంతో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.