అక్టోబర్ 18న బీసీ బంద్ను సక్సెస్ చేయాలి : బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు

అక్టోబర్ 18న బీసీ బంద్ను సక్సెస్ చేయాలి :  బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు

కామారెడ్డి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్​చట్టబద్ధత కోసం ఈనెల 18న తలపెట్టిన బంద్​ను జిల్లాలో సక్సెస్​ చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్​ అండ్​ బీ గెస్ట్​హౌజ్​లో  నిర్వహించిన మీటింగ్​లో ప్రతినిధులు మాట్లాడారు.  వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్​పాటించాలన్నారు.

 అంతకు ముందు బీసీ సంఘాల ప్రతినిధులు చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణ వర్తక సంఘం, తదితర సంఘాల ప్రతినిధులను కలిసి బంద్​కు మద్దతు ఇవ్వాలని కోరారు. మీటింగ్​లో బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ,  అంబేద్కర్​ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.  ఎంజీ వేణుగోపాల్​గౌడ్​, సాప శివరాములు,  కుంబాల రవి, జగదీశ్​యాదవ్,  అరికల ప్రభాకర్,  గరిగంటి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్​గౌడ్, నాగరాజు, లక్ష్మణ్, మల్లయ్య, సిద్ధిరాములు పాల్గొన్నారు.  

నిజామాబాద్​ పట్టణంలో..

 నిజామాబాద్​అర్బన్ : బీసీ బంద్​కు సబ్బండ వర్ణాలు మద్దతు తెలుపుతున్నాయి.  గురువారం నిజామాబాద్​లోని గీతాభవన్​లో అన్ని పార్టీల లీడర్లతో పాటు పలు సంఘాలు రౌండు టేబుల్​ సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీలు, కుల, ప్రజా, డాక్టర్లు, లాయర్లు, మహిళా, రైతు, గంజ్​వర్తక, బంగారు, వెండి వర్తక, కిరాణ వర్తక సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్​ కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ బంద్​లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో బీసీ జేఏసీ  చైర్మన్​ లక్ష్మీనారాయణ, వైస్​ చైర్మన్​ బొబ్బిలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 

బంద్​కు బీఎస్పీ మద్దతు.. 

బోధన్​, వెలుగు : బీసీ బంద్​కు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు నీరడి ఈశ్వర్​, జిల్లా అధ్యక్షుడు సింగడే పాండి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివేను సంతోష్​ తెలిపారు. గురువారం విలేకరులతో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల అమలుతో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.  రాజ్యంగంలోని 9వ షెడ్యూల్​లో బీసీ రిజర్వేషన్​చేర్చాలని డిమాండ్​ చేశారు.  బీఎస్పీ బోధన్ అసెంబ్లీ ఇన్​చార్జి నీరడి రవి, అసెంబ్లీ అధ్యక్షుడు రమేశ్​దాస్, సాలూర మండల అధ్యక్షుడు వాగమారే జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.  

సీపీఐ(ఎంఎల్)మాస్​లైన్​ (ప్రజాపంథా) మద్దతు..

బీసీ బంద్​కు సీపీఐ(ఎంఎల్​)మాస్​లైన్ (ప్రజాపంథా) పార్టీ మద్దతు ఇస్తుందని డివిజన్ కార్యదర్శి ప్రెస్​మీట్ లో తెలిపారు.  జీవో నెంబర్ 9 ఆర్డినెన్స్ పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడం సరికాదన్నారు.  సమావేశంలో బోధన్ పట్టణ నాయకులు ఇర్షాద్ భాయ్, డి.పోశెట్టి, పి. ప్రవీణ్, ఆజాం, పోశెట్టి, బి. నాగమణి, బీపాషా బేగం  పాల్గొన్నారు.