రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై అర్థరాత్రి దాడి

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై అర్థరాత్రి దాడి

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై గత అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అర్నబ్ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆయన ఆరోపించారు.

గురువారం రాత్రి 12.15 గంటల సమయంలో కారులో ఇంటికి బయలుదేరామని చెప్పారు అర్నాబ్ . అయితే తమ కారును రెండు బైక్ లు వెంబడించాయన్నారు. బైక్ పై ఉన్న వారు కారులోకి తొంగిచూసి…ఆ తర్వాత ఓవర్ టేక్ చేసి, రోడ్డుకు అడ్డంగా బైక్ లను ఆపారని చెప్పారు. వారి నుంచి తప్పించుకునేందుకు కారును ఆపకుండా వెళ్తుంటే .. కారు అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఏదో లిక్విడ్ ఉన్న సీసాలను కరుపై విసిరేశాని..దీంతో కారును మరింత స్పీడ్ గా డ్రైవ్ చేసినట్లు చెప్పారు ఆర్నబ్.అయితే  కారు వెనకే వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకున్నట్లు తెలిపారు.  ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడగా, యూత్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారని చెప్పారు అర్నబ్ గోస్వామి. తమ నేతలు చెప్పినందునే దాడి చేసేందుకు వచ్చామని వారు అంగీకరించారని కూడా తెలిపారు. దీంతో సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశానని… తనపై దాడికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.