కృత్రిమశ్వాస అందించిన రెస్క్యూ సిబ్బంది

కృత్రిమశ్వాస అందించిన  రెస్క్యూ సిబ్బంది

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఓ భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లయ్యగిరి రాజు అనే వ్యక్తి అమ్మవార్ల దర్శనం కోసం ఉదయం నుంచి జాతర క్యూ లైన్​లో నిల్చున్నాడు. అయితే ఎండ వేడికి అలిసిపోవడంతో ఛాతిలో నొప్పితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే రెస్క్యూ సిబ్బంది గమనించి అతడికి కృత్రిమ శ్వాసం అందించారు. చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే భారీగా భక్తులు క్యూలైన్​లోకి చేరడంతో ఊపిరి ఆడక పలువురు శ్వాస తీపుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.