బీహార్​లో రిజర్వేషన్లు 65 శాతానికి పెంపు

బీహార్​లో రిజర్వేషన్లు 65 శాతానికి పెంపు
  •     సీఎం నితీశ్​ కుమార్​ ప్రతిపాదన

పాట్నా :  రిజర్వేషన్లకు సంబంధించి బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50% ఉండగా.. వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన(ఈడబ్ల్యూఎస్)వర్గాలకు కేంద్రం కల్పించిన10% రిజర్వేషన్‌‌ను కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు75 శాతానికి చేరనున్నాయి. ఈ ప్రతిపాదనలు 1992లో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని దాటుతుంది.

ప్రభుత్వం ప్రతిపాదించిన కోటా ప్రకారం..16% ఉన్న ఎస్సీల రిజర్వేషన్లు 20 శాతానికి, 30(18+12) శాతం ఉన్న ఓబీసీ, ఈబీసీల రిజర్వేషన్​ 43 శాతానికి, 1% ఉన్న ఎస్టీల రిజర్వేషన్​ 2 శాతానికి పెరగనుంది. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి.