ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు
  •     నేడు నోటిఫికేషన్ విడుదల 

 కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాపుల  నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ గురువారం పూర్తయింది.  జిల్లాలో మొత్తం 94 వైన్స్ షాపులకు గానూ 17 షాప్ లు గీత కార్మికులకు, 9 వైన్స్ ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఏయే దుకాణాలు గీత కార్మికులకు, ఎస్సీలకు రిజర్వ్ చేయాలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. 

జిల్లాలో మద్యం దుకాణాల కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 30 న ముగియనంది. ఈ లోపే నూతన టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారులను ఖరారు చేసేందుకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలో 21, కరీంనగర్ రూరల్ 26, తిమ్మాపూర్ 14, హుజూరాబాద్ 17,జమ్మికుంట 16 దుకాణాలు ఉండగా గతేడాది 4,040 దరఖాస్తులు వచ్చాయి.

రాజన్నజిల్లాలో 48 దుకాణాలు

రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో మద్యం షాపులకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 9, ఎస్సీలకు 5 కేటాయించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వచ్చేనెల 18 వరకు అప్లికేషన్లు స్వీకరించి, అదే నెల 23న షాపులను కేటాయించనున్నట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
తెలిపారు. 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో 71 వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సత్యనారాయణ తెలిపారు. వీటిలో 14 గౌడ కులస్తులకు ,8 ఎస్సీలకు కేటాయించారు. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో 74 వైన్స్ షాపులకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో  గౌడ కులస్తులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు  రిజర్వ్ చేశారు. వీటిని లాటరీ ద్వారా కేటాయించనున్నారు. 
 

మరిన్ని వార్తలు