మా గల్లీ పేరు మార్చండి..మోడీకి యూపీ వాసుల వినతి

మా గల్లీ పేరు మార్చండి..మోడీకి యూపీ వాసుల వినతి

ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రం గ్రేటర్‌‌ నోయిడాలోని ఓ కాలనీ వాళ్లు తమ గల్లీ పేరు మార్చాలని మొత్తుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌‌కు మొరపెట్టుకున్నారు. వాళ్లకు లేఖలు రాశారు. ఇండియా విభజన టైంలో కొందరు పాకిస్థాన్‌‌ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిపోయారు. ఆ టైంలో ఆ వీధిని ‘పాకిస్తాన్ వాలీ గలీ’ అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆ పేరునే వాడుతున్నారు. ఇప్పుడక్కడ 70 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇప్పటికీ వాళ్లను పాకిస్థానీలుగా గుర్తించడంపై కాలనీ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆధార్‌‌ కార్డులపైనా ‘పాకిస్తాన్‌‌ వాలీ గలీ’ అని ఉండటంతో పనిలో చేర్చుకోవడం లేదంటున్నారు. కష్టపడి పిల్నల్ని చదివించినా ఉద్యోగాల్లో చేర్చుకోవడం లేదని వాపోతున్నారు. తమ పూర్వీకులు పాకిస్తానీలైతే ఆ తప్పు తమది కాదని, తాము ఇండియన్లమని, ఇక్కడే బతుకుతున్నామని, ఈ దేశంలో తామూ భాగమని చెబుతున్నారు. తమ దేశంలోనే తమను వేరుగా చూడటం బాధనిపిస్తోందని ఆవేదన చెందుతున్నారు. ప్రధాని మోడీపై తమకు నమ్మకముందని, తమ గురించి ఆయనకు తెలిస్తే తప్పక సాయం చేస్తారని అంటున్నారు.