కారోబార్​ను తొలగించాలని రెండు గ్రామాల ప్రజల తీర్మానం

కారోబార్​ను తొలగించాలని రెండు గ్రామాల ప్రజల తీర్మానం

తాళం వేసిన వ్యక్తిపై  పీఎస్​లో కేసు నమోదు  

ఏటూరునాగారం, వెలుగు: గోదావరి వరదలకు నష్టపోయిన తమకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం రూ.10వేలు అందకపోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీసర్లే కారణమంటూ ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్​లో గ్రామస్థులు జీపీ ఆఫీస్​కు తాళం వేశారు.  కారోబార్​ ఇర్సవడ్ల రాజు తన బంధువులకే సాయం అందేట్టు ఆఫీసర్లకు తప్పుడు రిపోర్టులు పంపించారని రాంనగర్​ గ్రామస్థులతో పాటు పంచాయతీ పరిధిలోని లంబాడీ తండా వాసులు ఆరోపించారు. ముంపు కారణంగా రెండు గ్రామాల నుంచి 72 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన ఆఫీసర్లు కేవలం 12 మందికే సాయం ఇచ్చారన్నారు.

దీనికి కారోబార్​ కారణమని ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తూ ఓ తీర్మాన పత్రం తయారు చేశారు. దాన్ని జీపీ ఆఫీస్​ మెయిన్​ డోర్​కు అంటించి ఆఫీసర్లు ఎవరూ లోపలకు వెళ్లకుండా తాళం వేశారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఎవరూ డ్యూటీ చేయవద్దని  భీష్మించుక్కూర్చున్నారు. కాగా జీపీ ఆఫీస్​కు తాళం వేసిన మహేందర్​తమను తిట్టాడంటూ.. సర్పంచ్​రమాదేవి, కారోబార్​ రాజు పీఎస్​లో కంప్లయింట్​చేశారు. దీంతో ఎస్సై రమేశ్​కుమార్​ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.