బాసర ఆలయంలో అధికారుల ఆంక్షలు.. భక్తుల ఇబ్బందులు

బాసర ఆలయంలో అధికారుల ఆంక్షలు.. భక్తుల ఇబ్బందులు

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పోలీసులు, అధికారుల ఆంక్షలు విధించారు. గతంలో ఎన్నడు లేని విధంగా భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి పోలీసులు, అధికారుల బంధువులకు ప్రాధాన్యత ఇస్తుండడం, ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులకు చాలా సమయం పడుతోంది. 

గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండడంతో ఓ షుగర్ పేషంట్, యువతి స్పృహతప్పి పడిపోయారు. అక్కడ అధికారులు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఐపీ, పోలీసు కుటుంబాల సేవలో ఆలయ సిబ్బంది తరిస్తున్నారు. పార్కింగ్ దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వృద్దులు, చిన్నపిల్లల తల్లుల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భక్తులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.