నైకూ ఎన్‌కౌంటర్‌‌: కాశ్మీర్‌‌లో ఆంక్షలు

నైకూ ఎన్‌కౌంటర్‌‌: కాశ్మీర్‌‌లో ఆంక్షలు
  • పాస్‌లు ఉన్నవారికే అనుమతి

శ్రీనగర్‌‌: మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు.. హిజ్బుల్‌ చీఫ్‌ నైకూ ఎన్‌కౌంటర్‌‌ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌‌లో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కాశ్మీర్‌‌ వ్యాలీలో లా అండ్‌ ఆర్డర్‌‌ను మెయింటైన్‌ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. హత్యకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కంచెలు, బారికేడ్లు పెట్టి రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం పాస్‌లు ఉన్నవారిని మాత్రమే బయటకి అనుమతించారు. కరోనా కారణంగా ఆంక్షలు ఉన్నప్పటికీ శుక్రవారం గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో రియాజ్‌ నైకూను పోలీసులు హతమార్చారు. దీంతో అప్పటి నుంచి కాశ్మీర్‌‌లో ఇంటర్నెట్‌, టీవీపై అధికారులు బ్యాన్‌ విధించారు.