పుల్వామా దాడిపై రిటైర్డ్ లెఫ్టెనెంట్ జనరల్ కీలక వ్యాఖ్యలు

పుల్వామా దాడిపై రిటైర్డ్ లెఫ్టెనెంట్ జనరల్ కీలక వ్యాఖ్యలు

పుల్వామా ఎటాక్ జరిగి నేటికి మూడేళ్లు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపురా సమీపంలోని లేథిపురలో  ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. 

తాజాగా ఈ దాడికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ ధిల్లాన్. జైష్-ఎ-మొహమ్మద్‌కు వ్యతిరేకంగా భద్రతా దళాల ఆపరేషన్ల తర్వాత ఉగ్రవాదులు భయాందోళనలకు గురయ్యారన్నారు కేజీఎస్. తీవ్రవాదులు చనిపోతారని చాలా భయపడ్డారన్నారు. అందుకే ఎవరూ కూడా  నాయకత్వ పాత్రను పోషించడానికి ముందుకు రాలేదన్నారు. పాక్ నుండి వచ్చిన కాల్‌లు ఉగ్రవాదులను నాయకత్వ పాత్ర పోషించమని అడిగినా ఉగ్రవాదులు మాత్రం దాన్ని తిరస్కరించారని తెలిపారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్. 

దాడి జరిగిన 100 గంటల్లోనే పాకిస్థానీ జాతీయుడు కమ్రాన్ నేతృత్వంలోని భద్రతాదళాలు  పుల్వామా దాడి వెనుక ఉన్న మాడ్యూల్‌ను తొలగించాయన్నారు. 2019 పుల్వామా దాడి జరిగినప్పుడు జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 15 కార్ప్స్‌కు లెఫ్టినెంట్ జనరల్ KJS ధిల్లాన్ (రిటైర్డ్)  నాయకత్వం వహించారు పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు ఐక్యంగా పనిచేస్తున్నాయన్నారు. పాక్ సైన్యం చురుకైన భాగస్వామ్యం, మార్గదర్శకత్వం లేకుండా అక్కడివారు ఎవరూ నియంత్రణ రేఖను దాటలేరన్నారు.  ఆర్మీ పోస్ట్‌కు ఎదురుగా పాక్ నియంత్రణ రేఖ నుంచి వచ్చిన పాక్ జాతీయులను గుల్‌మార్గ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై పట్టుకున్నామన్నారు KJS ధిల్లాన్. 
 

ఇవి కూడా చదవండి: 

అమర జవాన్లను ప్రతిపక్షాలు అవమానిస్తున్నయ్