త్రివిధ దళాలలో పనిచేసిన ఒకే ఒక్కడు.. నేడు వందో బర్త్‌డే

త్రివిధ దళాలలో పనిచేసిన ఒకే ఒక్కడు.. నేడు వందో బర్త్‌డే

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన రిటైర్డ్ అధికారి కల్నల్ ప్రితిపాల్ సింగ్ గిల్ ఈ రోజు తన 100 వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన భారత రక్షణ రంగానికి చెందిన మూడు యూనిట్లకు సేవలందించిన ఏకైక అధికారి. గిల్ రెండో ప్రపంచ యుద్దానికి ముందు రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. గిల్ ఆ సమయంలో ఎత్తైన సముద్రాల మీదుగా ప్రయాణించాడు. ఎయిర్‌ఫోర్స్‌ తరువాత ఆయన ఆర్మీలో గన్నర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించాడు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం మరియు 1965లో భారత-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. కల్నల్ ప్రితిపాల్ సింగ్ గిల్ పదవీ విరమణకు ముందు మణిపూర్‌లోని అస్సాం రైఫిల్స్‌లో సెక్టార్ కమాండర్‌గా పనిచేశారు. గిల్ రిటైర్డ్ అయిన తర్వాత ప్రస్తుతం తన సొంత గ్రామమైన ఫరీద్‌కోట్‌లో వ్యవసాయం చేస్తున్నారు.

భారత త్రివిధ దళాలకు గిల్ చేసిన సేవలకు గాను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు అందజేస్తున్నారు. గిల్ మరికొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉండాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. గిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘నేటితో 100 ఏళ్ళు నిండిన కల్నల్ ప్రితిపాల్ సింగ్ గిల్‌ను అభినందించండి. మూడు సాయుధ దళాలలోనూ పనిచేసినందుకు ఆయనకు ప్రత్యేకత ఉంది. సర్, మీరు ఇంకా చాలా సంవత్సరాలపాటు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మా అందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటారు’అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రితిపాల్ సింగ్ గిల్ పుట్టినరోజు సందర్భంగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కెజె సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిల్ ఆర్మీ కెరీర్ గురించి ఆయన కొన్ని విషయాలు ట్వీట్ చేశారు. ‘ప్రితిపాల్ సింగ్ గిల్ ఆ రోజుల్లోనే కుటుంబ అనుమతి లేకుండా రాయల్ ఇండియన్ వైమానిక దళంలో చేరారు. ఆయన కరాచీలో పైలట్ ఆఫీసర్‌గా నియమించబడి.. హోవార్డ్ విమానాలను నడిపారు. కల్నల్ గిల్ మైన్ స్వీపింగ్ షిప్ మరియు ఐఎన్ఎస్ టీర్‌లో పనిచేశారు. అతను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కార్గో షిప్‌ల కోసం నేవీ ఎస్కార్ట్ బృందంలో భాగమయ్యారు’అని కెజె సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

For More News..

గొడవ ఆపడానికిపోయిన యువకుడికి 22 కత్తిపోట్లు

మధ్యాహ్నం రాజీనామా.. కేటీఆర్ ఫోన్ కాల్‌తో రాత్రి విత్ డ్రా

నాగార్జునసాగర్ పై గులాబీ సర్వే.. బైపోల్‌ కోసం పక్కా వ్యూహం