
- టెంపుల్ పేరున రిజిస్ట్రేషన్ చేసిన రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు
యాదగిరిగుట్ట, వెలుగు : హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు రూ. 4 కోట్ల విలువైన మూడు అంతస్తుల బిల్డింగ్‌ను యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి డొనేట్ చేశారు.
ఈ మేరకు గురువారం చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం సంబంధించిన డాక్యుమెంట్లను ఆలయ ఈవో వెంకటరావు, చైర్మన్ నరసింహమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును సన్మానించి లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో భాస్కర్‌శర్మ, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.