అన్ని దందాల్లోనూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలే : రేవంత్ రెడ్డి

అన్ని దందాల్లోనూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలే :  రేవంత్ రెడ్డి

 

  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెయ్యి, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వంద.. ఎకరాల ఫాం హౌస్‌‌‌‌‌‌‌‌
  • పాలమూరు జిల్లాకు మాత్రం చేసిందేమీ లేదు: రేవంత్ రెడ్డి
  • వక్ఫ్ భూములనూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కబ్జా చేసిండు
  • పోలీసులు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తల్లా ఉండొద్దు
  • అక్రమ కేసులు పెట్టి వేధిస్తే మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్లు గడిచినా పాలమూరుకు చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వక్ఫ్ భూములనూ వదలకుండా ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రేవంత్ నివాసంలో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు రేవంత్, సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో అంలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి శూన్యం. ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మైనా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు సీఎం అయినా జిల్లాను పట్టించుకోవట్లేదు. కానీ, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రం వెయ్యి ఎకరాల ఫాంహౌస్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంద ఎకరాల ఫాం హౌస్ సంపాదించుకున్నరు. వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు కూడబెట్టుకున్నారు. టీవీలు, పేపర్లూ పెట్టారు. కేసీఆర్ చేతిలో పాలమూరు జిల్లా మోసపోయింది’’అని రేవంత్‌‌‌‌‌‌‌‌ ఫైర్ అయ్యారు. 

అన్ని దందాల్లోనూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలే..

రాష్ట్రంలో జరుగుతున్న అన్ని దందాల్లోనూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలే ఉన్నారని రేవంత్ ఆరోపించారు. ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్.. ఇలా ఏ దందా చూసినా వాళ్లే ఉంటున్నారన్నారు. వారి అరాచకాలను ఎదిరించేందుకు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, వారందరికి అండగా ఉంటామని చెప్పారు. పోలీసులు, అధికారులు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని హితవు పలికారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తే మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 14 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దేనన్నారు. కాగా, పార్టీలో చేరిన వారిలో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాధా అమర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవి తదితరులు ఉన్నారు.