కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇండ్ల స్థలాల అంశం పరిశీలిస్తాం : రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇండ్ల స్థలాల అంశం పరిశీలిస్తాం : రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • కాంగ్రెస్ మేనిఫెస్టోలో.. ఇండ్ల స్థలాల అంశం పరిశీలిస్తాం
  • డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు రేవంత్ హామీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : జర్నలిస్టుల ఇంటి స్థలాల అం శాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తానని, ఈ విషయాన్ని శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు నేతృత్వంలోని కమిటీకి నివేదిస్తానని పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసై టీ (డీజేహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అధ్యక్షుడు బొల్లోజు రవి, ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు జి.ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, దండ రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు ఆదివారం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని చేర్చాలని కోరారు.

ఈ సందర్భంగా రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు పట్ల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ సానుకూలంగా ఉందన్నారు. ఈ సందర్భంగా డీజేహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు బొల్లోజు రవి మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు 300 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు.