
- 180 మంది రెవెన్యూ ఎంప్లాయీస్ అక్కడే డ్యూటీ వచ్చిన అప్లికేషన్లు 15,046
- సాదా బైనామా, పీవోటీ, కోర్టు కేసులు పక్కకు
- 1,785 అప్లికేషన్లకు ఓకే
యాదాద్రి, వెలుగు: భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహిం చిన సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లు. 17 మండలాల రెవెన్యూ ఎంప్లాయీస్అప్లికేషన్ల పరి ష్కారంపై కుస్తీ పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలో భాగంగా జూన్ 3 నుంచి 20 వరకు జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో 15,408 అప్లికేషన్లు వచ్చాయి.
వీటిలో పీవోటీ, సాదా బైనామాలకు సంబంధించినవే ఎక్కువ గా వచ్చాయి. వీటితోపాటు కోర్టులో ఉన్న భూ సమస్య లను పక్కన పెట్టి.. మిగిలిన సమస్యలను వెంటవెంట నేపరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్టు 15 వరకు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే తహసీల్దార్లు రెగ్యులర్ కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తూ భూ సంబంధిత అప్లికేషన్ల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. సదస్సులు ముగిసి నెల గడుస్తున్నా.. భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అప్లికేషన్లు చేసు కున్న రైతులు పెదవి విరుస్తున్నారు.
పరిష్కారంపై ప్రత్యేక దృష్టి..
భూసమస్యల పరిష్కారం ముందుకు సాగకపోవడం తోయాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఆగస్టు 15లోగా భూ సమస్యలు పరి ష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టరేట్లోనే వారం రోజులు క్యాంప్ ఏర్పాటు చేయించారు. దీంతో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, రెండు రెవెన్యూ డివిజన్ల స్టాఫ్, 17 మండలాల రెవెన్యూ స్టాఫ్ ఈనెల 23 నుంచి కలెక్టరేట్లోనే అప్లి కేషన్ల పరిష్కారానికి కుస్తీపడుతున్నారు. ఈ క్యాంపు ఈనెల 29 వరకు కొనగుతోంది. ఈలోపు సాధ్యమైన న్ని అప్లికేషన్లు పరిష్కరించాలని ఆదేశించారు.
1,785 అప్లికేషన్లు ఓకే..
సదస్సుల్లో వచ్చిన 15,046 అప్లికేషన్లలో చిన్నచిన్న సమస్యలకు సంబంధించినవి 1,785 ఉన్నట్టు గుర్తించారు. వీటిలో మిస్సింగ్సర్వే నెంబర్లు, పాతి, మ్యూటేషన్, ఇంటి పేరు, కులం, ఆధార్ తప్పులు వంటివి ఉన్నాయి. సాదాబైనామా, పీవోటీ, పీవోబీ, కోర్టు కేసుల్లో ఉన్నవి పక్కకు పెట్టి.. కింది స్థాయిలోనే పరిష్కరించే వీటిపై దృష్టి పెట్టారు. ఈ అప్లికేషన్లు చేసిన వారికి నోటీసులు ఇచ్చి.. 844 సమస్యలను పరిష్కరించారు. మిగిలిన వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది. ఆగస్టు 15 నాటికి అప్లికేషన్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వచ్చిన అప్లికేషన్లు 15,046
సమస్యల వారీగా అప్లికేషన్ల 4,779
పెండింగ్ మ్యూటేషన్లు 655
డీఎస్ పెండింగ్ 602
సవరణల 1,029
పీవోబీ 509
పీవోటీ, సాదాబైనామాలు 2,740
ఇతర సమస్యలు 4,732