
రెవెన్యూ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 13 నుంచి 22 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక పెన్షనర్లు, సీపీఎస్ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులుకు రక్షణ కల్పించాలనే డిమాండ్ తో ఈ నెల 13, 14 తేదీల్లో.. పెన్ డౌన్ చేయాలని నిర్ణయించారు అలాగే.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్ లకు మెమోరాండం ఇవ్వనున్నట్టు చెప్పారు. 15న తహశీల్దార్ కార్యాలయాల ముందు వంటా వార్పు, 16 నుంచి భూ సంబంధిత విధులు బహిష్కరిస్తామని, కేవలం అత్యవసర విధుల్లో మాత్రమే పాల్గొంటామని చెప్పారు.