
- సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వెల్లడించిన ఆఫీసర్లు
మెదక్‌టౌన్/సంగారెడ్డి టౌన్, వెలుగు : సవరించిన ఓటర్ల జాబితాను గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులు విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితాను నియోజకవర్గాల వారీగా ప్రదర్శించినట్లు సంగారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో 12,13,751మంది ఓటర్లు ఉన్నారని, అందులో మహిళా ఓటర్లు 5,99,366 కాగా, పురుష ఓటర్లు 6,14,334 మంది, ఇతరులు 51 మంది, సర్వీస్ ఓటర్లు 361 మంది ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గాలవారీగా నారాయణ్ ఖేడ్ లో మొత్తం 2,04,043 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు- 1,03,336, మహిళలు1,00,701, ఇతరు ఓటర్లు ఆరుగురు ఉన్నారు. అందోల్ లో మొత్తం 2, 26, 107మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు- 1,12,026, మహిళలు- 1,14,077, ఇతరులు- నలుగురు ఉన్నారు. జహీరాబాద్ లో మొత్తం 2,39,483 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు- 121292, మహిళలు- 118189, ఇతరులు- ఇద్దరు ఉన్నారు. సంగారెడ్డిలో మొత్తం 2,15,382 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు- 1,07,619, మహిళలు- 1,07,750, ఇతరులు- 13 మంది ఉన్నారు. పటాన్ చెరులో మొత్తం 3,28,736 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు- 1,70,061, మహిళలు1,58,649, ఇతరులు- 26 మంది ఉన్నారు.
మెదక్‌లో...
గత నవంబర్ 9న ఓటర్ల ముసాయిదా ప్రకటించే నాటికి జిల్లాలో 4,06,629 మంది ఓటర్లు ఉండగా, ఫైనల్ లిస్టు ప్రకటించే నాటికి 4,09,473 మంది ఓటర్లుగా ఉన్నారని మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేశ్ తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టడంతో కొత్తగా 9,860 ఓటర్లుగా నమోదయ్యారని వివరించారు. మెదక్ నియోజక వర్గంలో 2,02,636 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళలు 1,05,077, పురుషులు 97,556 మంది, ఇతరులు ముగ్గురు ఓటర్లు ఉన్నారని తెలిపారు. నర్సాపూర్ నియోజక వర్గంలో 2,06,837 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళలు 1,04,710, పురుషులు 1,02,120, ఇతరులు ఏడుగురు ఉన్నారని చెప్పారు.రెండు నియోజక వర్గాలలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఓటర్ల తుది జాబితాను జిల్లాలోని 576 పోలింగ్ బూత్‌లలో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. అందులో సాంకేతిక తప్పిదాలు, ఇతర అభ్యంతరాలు ఉంటే తెలిపితే సరిచేస్తామన్నారు. ఓటరు నమోదు, నిర్వహణలో ప్రజాప్రతినిధుల సహకారం బాగుందని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆంజనేయులు, శివ, మహ్మద్అఫ్జల్, సురేశ్, మెదక్ఆర్డీవో సాయిరామ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, నరేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.