సూడాన్‌‌లో విప్లవం.. కూలిన బషీర్‌ సర్కార్‌

సూడాన్‌‌లో విప్లవం.. కూలిన బషీర్‌ సర్కార్‌

‌ఓ యువతి కారు టాప్ పైకి ఎక్కి ‘థౌరా, థౌరా’అని అరుస్తోంది. చుట్టూ జనం గుమిగూడారు. కొందరు ఆమెతో గొంతు కలిపారు.ఇంకొందరు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడు సూడాన్లో ఎక్కడా చూసినా ఆమె నినాదమే వినిపిస్తోంది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. థౌరా అంటే విప్లవం. ఆమె పిలుపే దిక్సూచిగా మారి ఆధునిక విప్లవానికి నాంది పలికింది. ఆ అమ్మాయి పేరు ‘అలా సాలా’. సూడాన్ ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. ఒక్కసారి ఫొటోలోని అలా సాలాను చూస్తే ఆమె ఎందుకు అంత పాపులరో తెలుస్తుంది.ఈ ఫొటోను లానా.హెచ్.హారున్ తీశారు. ‘‘గత 30ఏళ్లుగా మేం ఎదురుచూస్తున్న సందర్భం ఇది” అని ఆ ఫొటోను ఉద్దేశిస్తూ సూడాన్ మహిళా హక్కుల కార్యకర్త హాలా అల్ కరీబ్ అన్నా రు.నిరసనల్లో 70 శాతం మహిళలే సూడాన్ ప్రెసిడెంట్ ఒమర్ అల్ బషీర్ కు వ్యతిరేక నిరసనల్లో పాల్గొనే వారిలో 70 శాతం మంది మహిళలే. నాలుగు నెలలుగా మరింత ఉధృంతంగా ఉద్యమం నడుస్తోంది. దీంతో సూడాన్ మిలటరీ గురువారం ప్రెసిడెంట్ ను పదవి నుంచి తప్పించింది. రెండేళ్ల పాటుమిలటరీ కౌన్సిల్ ఆధీనంలో సూడన్ ఉండబోతోంది.