
బాసర, వెలుగు : బాసర, మహబూబ్నగర్ లోని ఆర్జీయూకేటీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభమవుతుండగా.. శనివారం బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇబ్బందులు రాకుండా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 20 ప్రత్యేక గదుల్లో 30 మంది చొప్పున సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల విద్యార్థులు పత్రాల పరిశీలనకు సంబంధిత అధికారులను ఆహ్వానించినట్టు తెలిపారు.