న్యూఢిల్లీ: లీడర్, మిర్చి, మిరపకాయ్ సినిమాలతో తెలుగులో రిచా గంగోపాధ్యాయ మంచి ఫేమ్ దక్కించుకుంది. మూవీస్‌కు గుడ్‌బై చెప్పిన రిచా గతేడాది తన బాయ్ ఫ్రెండ్ జో లాంగెల్లాను పెళ్లి చేసుకుంది. తాజాగా తన మ్యారేజ్, రిలేషన్‌షిప్, రేసిజం, జీవితం గురించి తన అభిప్రాయాలను రిచా పంచుకుంది.
‘ఇది కరోనాతోపాటు ఎన్నికల సంవత్సరం. ఈ ఏడాది నేను మరింతగా నా గొంతును వినిపిస్తున్నా. వ్యక్తిగతంగా నాలో ప్రతిధ్వనించే విషయాలను చెప్పడానికి, సమానత్వం కోసం పోరాడేందుకు నా ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నా. ఓ ఇండో-అమెరికన్‌గా, ఇమ్మిగ్రెంట్ విమెన్‌గా రోజువారీగా నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జో, నేను కలసి జీవితాన్ని పంచుకోవడానికి రేసిజంతో ఎలాంటి సంబంధమూ లేదు. మా ఇద్దరి నమ్మకాలు, నేపథ్యాలు వేరు. విలువలకు మేం చాలా ప్రాధాన్యమిస్తాం. అణగారిన వర్గాలతోపాటు సాయం అవసరమైన వారి తరఫున నిలబడాలి. వ్యవస్థలో పలు మార్పులు రావాలి. కొన్ని విషయాలపై మనలో ఏర్పరుచుకున్న అభిప్రాయాలను తొలగించాలి. దేన్నీ గుడ్డిగా నమ్మద్దు. అది రాజకీయ పార్టీ కావొచ్చు లేదా ఓ వ్యక్తి అవ్వొచ్చు. సమగ్రత, నిజాయితీ వైపు నిలబడాలి. ఈ లక్షణాలు మా కుటుంబంలో ఉన్నాయి. వీటిని మా పిల్లలకు అందించాలని మేం ఆశిస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఇతరుల అనుభవాలను వినడానికి సిద్ధంగా ఉండరో లేదా మీరు పాటించే జీవన విధానం, మతం, విలువలే సరైనవని భావిస్తారో అప్పుడు మిమ్మల్ని మీరు ఎదగకుండా అడ్డుకుంటున్నట్లే. అలాగే మీ కంటే వైవిధ్యంగా ఉన్న వారిని దెప్పిపొడవడం కూడా సరైంది కాదు. మీ అధికారాన్ని అంగీకరించడం లేదనో, మీరు ఎదుర్కొన్న సవాళ్ల నుంచి మాటలను మరల్చుతున్నారనో ఇతరుల వాస్తవికతను, వాళ్లు అధిగమించిన సవాళ్లను ప్రశ్నించడం కరెక్ట్ కాదు. దీని బదులు వాళ్లు చెప్పేది వినండి. వాటి నుంచి నేర్చుకోండి. ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేస్తున్నారంటే.. అది వారి వ్యక్తిగత బాధ, డిప్రెషన్ నుంచి వచ్చిందని అర్థం చేసుకోవాలి. మీ కళ్లను తెరిచి అర్థం చేసుకోవడానికి యత్నించండి. 2020 కష్టమైన ఏడాది. మనందరం కలసి దీని నుంచి బయటపడతాం’ అని రిచా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.