DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. టాపార్డర్ విఫలమైనా.. కెప్టెన్ రిషబ్ పంత్(43 బంతుల్లో 88,5 ఫోర్లు, 8 సిక్సులు) అక్షర్ పటేల్(43 బంతుల్లో 66,5 ఫోర్లు, 4 సిక్సులు) భారీ భాగస్వామ్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు పవర్ ప్లే లో తడబడింది. ఎప్పటిలాగే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ప్రారంభంలో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 14 బంతుల్లోనే 23 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే నాలుగో ఓవర్లో సందీప్ వారియర్ ఢిల్లీకి కోలుకొని షాకిచ్చాడు. 

ఈ ఓవర్ లో మెక్‌గుర్క్ తో పాటు పృద్వీషా (11) ను ఔట్ చేసి గుజరాత్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరో ఓవర్లో షై హోప్ (5) ను ఔట్ చేసి ఢిల్లీని కష్టాల్లో పడేశాడు. ఈ దశలో అక్షర్ పటేల్ తో కెప్టెన్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పటిష్ట స్థితికి చేర్చారు. అక్షర్ పటేల్ ఔటైనా పంత్ చివరి వరకు క్రీజ్ లో ఉండి ఢిల్లీకు 220 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో పంత్ విశ్వరూపమే చూపించాడు. నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ తో ఏకంగా 31 పరుగులు రాబట్టాడు. 

మరో ఎండ్ లో స్టబ్స్ 7 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేసి సత్తా చాటాడు. చివరి 5 ఓవర్లలో ఢిల్లీ ఏకంగా 97 పరుగులు చేయడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు.