మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. రిషబ్ భావోద్వేగ ట్వీట్

మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. రిషబ్ భావోద్వేగ ట్వీట్

యాక్సిడెంట్ కు గురైన వెంటనే తనను కాపాడిన ఇద్దరు యువకులకు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెప్పలేకపోవచ్చు.. కానీ ఇద్దరు హీరోలకు మాత్రం తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలని రిషబ్ తెలిపారు. రోడ్డు ప్రమాదం తర్వాత వాళ్లిద్దరూ తనకు ఎంతో సాయం చేశారని చెప్పారు. కష్టకాలంలో తనను ఆస్పత్రికి చేర్చి, సురక్షితంగా ఉండేలా చేసిన వారి సహకారం మరవలేనిదన్నారు. రజత్ కుమార్, నిషు కుమార్... మీ ఇద్దరికీ కృతజ్ఞతలు.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ రిషబ్ భావోద్వేగభరిత ట్వీట్ చేశారు.

తనకు సపోర్ట్‌గా నిలబడిన వారందరికీ తాను ఎంతో కృతజ్ఞుడినిగా ఉంటానని రిషబ్ చెప్పారు. తన సర్జరీ విజయవంతమైందని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానన్నారు. భవిష్యత్తులో వచ్చే ప్రతీ ఛాలెంజ్ ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని..తనకు అన్ని విధాలా అండగా నిలిచిన బీసీసీఐ, జైషా, ప్రభుత్వ అధికారులకు థ్యాంక్యూ... అంటూ రిషబ్ చెప్పారు.