ఐపీఎల్​, ఆసీస్​ సిరీస్​కు పంత్​ దూరం!

ఐపీఎల్​, ఆసీస్​ సిరీస్​కు పంత్​ దూరం!

డెహ్రాడూన్​: కారు యాక్సిడెంట్​కు గురై హాస్పిటల్​లో చికిత్స తీసుకుంటున్న టీమిండియా వికెట్ ​కీపర్​ రిషబ్​ పంత్​.. ఆరు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. దీంతో అతను ఫిబ్రవరిలో మొదలయ్యే ఆస్ట్రేలియా సిరీస్​తో పాటు ఐపీఎల్​ మొత్తానికి అందుబాటులో ఉండే చాన్స్​ లేదు. ఎంఆర్​ఐ స్కాన్​లో మెదడు, వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది. కానీ, నుదుటి భాగంలో గాట్లతో కుడి మోకాలిలో లిగమెంట్​ చీరుకు పోయింది. దీని నుంచి​ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి పంత్​కు మూడు నుంచి ఆరు నెలలు పట్టనుంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంకాస్త ఎక్కువ టైమ్​ పట్టొచ్చు.  పంత్​ హెల్త్​ కండీషన్​ను బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.