తపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు

తపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు

ఉత్తరాఖండ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరద ధాటికి డెహ్రాడూన్ లోని ప్రసిద్ధ తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో ప్రవహించే తమసా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో మాతా వైష్ణో దేవీ గుహ యోగ దేవాలయం, తపకేశ్వర్ మహాదేవ్ ఆలయాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వరద నీరంతా ఆలయంలోకి చేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ ఆలయం వ్యవస్థాపకులు ఆచార్య బిపిన్ జోషి తెలిపారు. దీంతో యాత్రికుల తరలింపు ప్రక్రియ కూడా నిలిపివేశారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇప్పటికే మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గత రెండు నెలల క్రితం ఇదే తరహాలో అమర్ నాథ్ పవిత్ర గుహ ప్రాంతంలోనూ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్ని రోజుల పాటు యాత్రను నిలిపివేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఉత్తర్ ఖాండ్ లో వర్షాలు విలయం తాండవం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలు వరద గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నాయి.