ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా నటించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించారు. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. రీసెంట్‌గా సెన్సార్ పూర్తయింది.
యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. పెద్దగా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ అధికారులకు ధన్యవాదాలు. భీముని పాత్రలో కిరణ్ చెప్పిన వన్ మినిట్ నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది. అక్సా ఖాన్ డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుంది. వీర జవాన్ల గొప్పతనాన్ని తెలియజేసే పాటను మధుప్రియ ఆలపించారు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం’ అని చెప్పారు. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తానని కిరణ్ అన్నాడు. ఈ చిత్రాన్ని పెద్ద విజయం చేయాలని అక్సా ఖాన్ కోరింది. నటులు తులసి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
