ఆర్కే న్యూటెక్​కు 5 స్టార్ రేటింగ్ అభినందనీయం : జీఎం ఎం.శ్రీనివాస్

ఆర్కే న్యూటెక్​కు 5 స్టార్ రేటింగ్ అభినందనీయం : జీఎం ఎం.శ్రీనివాస్

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్‌ ‌ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 5 స్టార్ రేటింగ్ సాధించడం అభినందనీయమని జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గని అధికారులు, సూపర్‌‌వైజర్లు, ఉద్యోగుల కృషి ఫలితంగానే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. దేశంలోని144 భూగర్భ గనుల్లో ఆర్కే న్యూటెక్ గని మూడో స్థానంలో నిలవడం హర్షణీయమని పేర్కొన్నారు. 

మహిళా ఉద్యోగులకు రెస్ట్ హాల్​ ప్రారంభం

సింగరేణి మహిళా ఉద్యోగులు కోసం ఆర్కే7 గనిలో ఏర్పాటు చేసిన రెస్ట్ హాల్​ను జీఎం శ్రీనివాస్ శుక్రవారం  ప్రారంభించారు.  భూగర్భంలో, ఉపరితలంలో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గనుల్లో మహిళా ఉద్యోగుల హాజరు శాతం బాగుందని, పురుషులు తమ హాజరు శాతాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఏఐటీయూసీ నాయకుడు బాజీసైడా, గ్రూపు ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ స్వామిరాజు, గ్రూప్ ఇంజినీర్ రవిచరణ్, రక్షణ అధికారి కొట్టె రమేశ్, సంక్షేమ అధికారి పాల్ సృజన్ పాల్గొన్నారు.

క్రికెట్ జట్టుకు అభినందన

ఇటీవల కొత్తగూడెంలో సింగరేణి అధికారులకు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన బెల్లంపల్లి రీజియన్ క్రికెట్ జట్టును జీఎం శ్రీనివాస్​శుక్రవారం అభినందించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కలుగుతాయన్నారు. ఏజీఎం ఫైనాన్స్ బీభత్స, క్రికెట్ జట్టు కెప్టెన్ లోకనాథ్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.