
కోల్‌బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మందమర్రి అనుభవ వైద్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్ఎంపీ, పీఎంపీలు కలిశారు. వారు మాట్లా డుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను ఆపేలా చొరవచూపా లని, తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర అనుభవ వైద్య సంఘాల అధ్యక్షుడు డాక్టర్చొప్పరి శంకర్, రాష్ట్ర కార్యదర్శి గాదాసు శంకరయ్య, సంయుక్త కార్యదర్శి రంగు రవీందర్, కోశాధికారి నగేశ్, మందమర్రి బాధ్యులు శ్రీనివాస్, గోవర్ధన్, తిరుమల తదితరులు పాల్గొన్నారు.
వైద్య సౌకర్యాలు కల్పించాలని -సింగరేణి రిటైర్డు ఉద్యోగుల వినతి
సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు నేతృత్వంలో గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంత్రి వివేక్ను కలిశారు. తమకు మెరుగైన వైద్య సౌకర్యాలు, రేషన్‌కార్డులను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. వారు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.