రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి ..మెదక్ జిల్లాలో ఘటన

రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి ..మెదక్ జిల్లాలో ఘటన

మనోహరాబాద్, వెలుగు:  మెదక్ జిల్లాలో రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి చెందాడు.  ఎస్ఐ సుభాష్​గౌడ్ తెలిపిన మేరకు.. మండలంలోని ముప్పిరెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులు(31) బైక్ పై బుధవారం అర్ధరాత్రి కాళ్లకల్ వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ముప్పిరెడ్డిపల్లి నుంచి కాళ్లకల్ వెళ్తున్న స్కూటీని స్పీడ్ గా ఢీకొట్టడడంతో ఆంజనేయులు కింద పడడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి.

 స్కూటీ పైనున్న మహేందర్, అతని తల్లి బాలమణికి తీవ్రగాయాలు కాగా మేడ్చల్ లోని ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు గురువారం చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.