
- కొల్లూరు ఓఆర్ఆర్ పై ప్రమాదం
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఆగి ఉన్న టిప్పర్‌ను ఓ కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్లూర్ సీఐ సంజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ములుసింగ్ భదౌరియా(41), ధర్మేందర్ సింగ్(35) లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. రెండు టిప్పర్లను తీసుకుని నాగపూర్‌నుంచి బెంగళూరుకు వెళ్తూ గురువారం హైదరాబాద్శివారులోని పటాన్చెరు వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డు ఎక్కారు. కొద్దిదూరం వెళ్లాక కొల్లూర్ టోల్ గేట్‌కు సమీపంలో ములుసింగ్ భదౌరియా నడుపుతున్న టిప్పర్ ఎక్సల్ఊడిపోయింది.
గమనించిన డ్రైవర్లు రెండు టిప్పర్లను పక్కకు తీసి, ఒకదాని వెనుక మరొకటి ఆపారు. ఊడిపోయిన భాగాన్ని చెక్‌చేస్తుండగా, అదే టైంలో హర్యానా నుంచి వచ్చిన ఓ కంటైనర్ ఆగి ఉన్న టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. రెండు టిప్పర్లు మధ్య ఉన్న ములుసింగ్, ధర్మేందర్‌సింగ్ ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు..
గజ్వేల్/ములుగు: సిద్దిపేట జిల్లా మర్కూక్సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్కూక్మండలం గంగాపూర్‌కు చెందిన కుషాల్(26) గురువారం రాత్రి బైక్‌పై మర్కూక్ నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. యూసఫ్ఖాన్పల్లికి చెందిన శ్రీరాంబాబు(27) బైక్‌పై మర్కూక్వస్తున్నాడు. మండల కేంద్రానికి సమీపంలో టిప్పర్‌ను క్రాస్చేసే క్రమంలో ఇరువురి వెహికల్స్ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.