నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ జంక్షన్ దగ్గర నవంబర్ 2న ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు - ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం కారు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. కారు డ్రైవర్ కు బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో హైవేపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు అతి వేగమే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
