బెల్లంపల్లి, వెలుగు : పట్టణంలోని కాల్టెక్స్ ఓవర్‌బ్రిడ్జి నుంచి కాంటా చౌరస్తా వరకు చేపట్టిన 100 ఫీట్ల రోడు విస్తరణ పనులకు శుక్రవారం బల్దియా అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలను బల్దియా అధికారులు జేసీబీలతో కూల్చివేశారు.
మున్సిపల్కమిషనర్ టి.రమేశ్ఆధ్వర్యంలో టీపీఎస్‌లు, టీపీబీవోలు, బల్దియా సిబ్బంది.. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను తొలగించారు. ఈ సందర్భంగా కొందరు బల్దియా అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది
