బహదూర్‍గుడలో నీట మునిగిన రోడ్లు

 బహదూర్‍గుడలో నీట మునిగిన రోడ్లు
  •  కల్వర్టు మూసేయడంతోనే సమస్య వచ్చిందన రైతులు

భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండల పరిధి బహదూర్గుడ గ్రామంలోని చెరువు నిండింది. దీంతో నీరు పొంగి పొర్లి చుట్టు పక్కల పొలాలు, రోడ్లను ముంచేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 

గొల్లపల్లి నుంచి బహదూర్​ గుడా, నాగారం, పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్​రోడ్డు నుంచి వెళ్లే దారి పూర్తిగా మునిగింది. ఉదయానే ఆఫీసులకు వెళ్లే వారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువు కల్వర్టు మూసివేయడంతోనే నీరంతా తమ పొలాలను ముంచెత్తిందని రైతులు ఆరోపించారు. ఓ వెంచర్ యజమాని కల్వర్టును మూసేశారని, ఆ స్థలంపై కేసు కోర్టు నడుస్తోందని అన్నారు. 

ఆయనపై చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. చెరువు నీరు యథాతథంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారుల చొరవతో కల్వర్టు పక్క నుంచి కాలువ తవ్వించి నీరు సక్రమంగా పోయేటట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు.